The Desk…Eluru : ప్రధాన మంత్రి స్వాస్థ సురక్షణ యోజన పథకం కింద 75 ప్రాజెక్టులకు ఆమోదం : ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ప్రధాన మంత్రి స్వాస్థ సురక్షణ యోజన పథకం కింద 75 ప్రాజెక్టులకు ఆమోదం : ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 దిల్లీ/ఏలూరు : ది డెస్క్ :

వైద్య విద్య మరియు వైద్య కళాశాలల విస్తరణపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి స్మాత్ అనుప్రియా పటేల్ శుక్రవారం లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మరియు స్ట్రీమ్ వారీగా వైద్య విద్యకు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య పెరిగిందని, 2020-21లో 83,275గా ఉన్న ఎంబిబిఎస్ సీట్లు 2024-25 నాటికి 39 శాతం పెరిగి 1,15,900కు చేరాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

జాతీయ వైద్య కమిషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిమ్స్, జెఐపీఎంఈఆర్ మినహాయించి గత నాలుగు విద్యా సంవత్సరాలలో యూజీ సీట్లు 2021-22లో 2,012, 2022-23లో 4,146, 2023-24లో 2,959, 2024-25లో 2,849 సీట్లు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం “కనీస ప్రమాణాల అవసరాల నిబంధనలు-2023” పేరిట మార్గదర్శకాలను రూపొందించిందని కేంద్ర మంత్రి బదులిచ్చారు.

50 మంది విద్యార్థుల కోసం కనీసం 220 ఫంక్షనల్ పడకలతో ఆసుపత్రి అవసరమని, బోధన, పరిశోధన, శిక్షణ కోసం ప్రత్యేక విభాగాల ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలని, పూర్తి సమయం బోధనా సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధించినట్లు, ప్రతి స్పెషాలిటీకి రోజువారీ కనీసం 8 మంది రోగులతో ఔట్ పేషెంట్ హాజరు తప్పనిసరి అని, గ్రామీణ, పట్టణ శిక్షణ కేంద్రాలలో ప్రాక్టికల్ క్లినికల్ శిక్షణ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాల్లో పొందుపరిచినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రాయోజిత పథకం కింద 157 కొత్త వైద్య కళాశాలలు ఆమోదించబడ్డాయి, వాటిలో 131 ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడ్‌కు కేంద్ర బడ్జెట్ మద్దతుతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని, పీ.ఎం.ఎస్ఎ.స్.వై కింద 75 సూపర్ స్పెషాలిటీ ప్రాజెక్టులు ఆమోదించగా వాటిలో అందులో 71 పూర్తయ్యాయని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న 22 ఎయిమ్స్‌లలో 19లో యూజీ కోర్సులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఇవి కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యా రంగాన్ని మరింత విస్తృతం చేయడానికి తీసుకుంటున్న కీలక చర్యలుగా కేంద్ర మంత్రి వివరించారు.