The Desk…Pamidimukkala : తాడంకి అక్రమ లే అవుట్ వ్యవహారంపై లోకాయుక్తలో [UFRTI] కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు…విజిలెన్స్  విచారణ

The Desk…Pamidimukkala : తాడంకి అక్రమ లే అవుట్ వ్యవహారంపై లోకాయుక్తలో [UFRTI] కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు…విజిలెన్స్ విచారణ

కృష్ణా జిల్లా : పమిడిముక్కల : ది డెస్క్ :

జంపాన శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో విద్యుత్ సబ్ స్టేషన్ లో అధికారులు, సిబ్బంది పై విజిలెన్స్ అధికారుల విచారణ..

తాడంకి లో అక్రమ లేఅవుట్ లో APCRDA నాన్-అప్రూవ్డ్ లే అవుట్‌లలో అనధికార విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి జంపాన శ్రీనివాస గౌడ్ నుండి అందిన ఫిర్యాదుపై బుధవారం విచారణకు ఆదేశించిన APCPDCL మేనేజింగ్ డైరెక్టర్ పుల్లా రెడ్డి.

జంపాన శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తను ఆశ్రయించడం.. లోకాయుక్త ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులకు విజిలెన్స్ మౌకిక విచారణ.

విద్యుత్ తీగలో ప్రసరించే హై వోల్ట్ కరెంట్ ఎంత పెర్ఫెక్టో.. అవినీతికి ఆమడదూరం అనే విషయంలో అంతే కరెక్ట్ గా ఉంటామంటూ విద్యుత్ శాఖ అధికారుల స్టేట్మెంట్…!

మరి అసలు అనుమతులు లేని అక్రమ లే అవుట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సహకారంలా.!

అనధికారికంగా రూపుదిద్దుకున్న వెంచర్లో అధికారికంగా విద్యుత్ లైన్లు నిబంధనలకు విరుద్ధంగా ఎలా ప్రత్యక్ష్యమయ్యాయి ..? అని ప్రశ్నిస్తున్నారు యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టిఐ (UFRTI),స.హ.చట్టం కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్.

విజిలెన్స్ విచారణ – ప్రశ్నలు – జవాబులు వెనుక విషయాలు వివరణలోకి వెళితే….!!!

కృష్ణాజిల్లా, పమిడిముక్కల మండలం, తాడంకి గ్రామ పరిధిలో సర్వే నం.150/1Bలోని 2.065 ఎకరాల భూమిలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ పుట్టుకు వచ్చింది.

పువ్వు పుట్టగానే పరిమళించినట్టు ఎటువంటి అధికారిక అనుమతులులేని ఆ వెంచర్లో శరవేగంగా విద్యుత్ శాఖ లైన్లు ఏర్పాటు చేయడం మెరుపు వేగంతో కరెంట్ సరఫరా చేయడం జరిగింది. ఇలా దగదగా విద్యుత్ వెలుగులతో కనిపించే రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్రభుత్వ శాఖ అనుమతులు ఉండి ఉంటాయని అమాయక ప్రజలు భావిస్తూ.. ఫ్లాట్ కొనడం.. ఆపై నిర్మాణాలు మొదలు పెడితే ఇబ్బందులు ఎదురవడం పరిపాటే.

ఈ నేపథ్యంలో తాడంకిలో అక్రమ లే అవుట్లో APCRDA నాన్-అప్రూవ్డ్ లే అవుట్‌లలో అనధికార విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి జంపాన శ్రీనివాస గౌడ్ లోకాయుక్త ను ఆశ్రయంచడంతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కు సంబంధించిన అంశంపై వివరణ కోరడం.. దానిపై శాఖ పరమైన విచారణకు యం.డి ఆదేశించడం చక చక జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో APCPDCL విజయవాడ ఎంక్వైరీస్ కార్పొరేట్ కార్యాలయం నుండి మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఎంక్వయిరిస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సయ్యద్ ఆసీఫ్, పర్సనల్ ఆఫీసర్ జి.మారుతి గురువారం సాయంత్రం పమిడిముక్కల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు దారులు జంపాన శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని ఫిర్యాదు అంశంపై మౌకికంగా విచారణ చేశారు.

తాడంకి లోని నాన్-అప్రూవ్డ్ APCRDA లేఅవుట్‌లలో అనధికార లైన్ల ఏర్పాటు నిజమేనా.. ? అధికారికంగా విద్యుత్ స్తంభాలు ఎందుకు ఏర్పాటు చేశారు.. ? సంబంధిత భూమి యాజమాన్యానికి సంబంధాలు ఏమిటి.. ? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు లిఖిత రూపంలో సేకరించినట్టుతెలుస్తోంది.

దాదాపు మూడు గంటల పాటు విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు. విచారణలో పామర్రు ఏ.డి.యి. సుందర రావు, పమిడిముక్కల అసిస్టెంట్ ఇంజనీర్ బి. శ్రీనివాసరావు, లైన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ లు హాజరయ్యి విచారణా అధికారులకు వివరాలు తెలియజేశారు. విచారణ నివేదికను APCPDCL మేనేజింగ్ డైరెక్టర్ కు అందజేయనునట్టు విచారణ అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టిఐ (UFRTI)కోస్తా జిల్లాల కన్వీనర్ బేతపూడి జోగేశ్వరరావు, ఉయ్యూరు మండల కన్వీనర్ బొల్లా శివపార్వతి, పమిడిముక్కల మండల కన్వీనర్ సాకే రాములమ్మ పాల్గొన్నారు.