ఏలూరు జిల్లా : ఏలూరు/కైకలూరు : ది డెస్క్ :

కైకలూరు పట్టణంలోని స్థానిక గ్రీన్ విలేజ్ ను సోమవారం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, కైకలూరు శాసనసభ్యుడు, గవర్నమెంటు అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా.కామినేని శ్రీనివాస్ లు సంయుక్తంగా సందర్శించి, పరిశీలించారు.
గ్రీన్ విలేజీలో గతంలో 3072 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వగా, 504 ఇళ్ళు పూర్తి అయ్యి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు అయ్యారాని, 2017 ఇళ్ళు నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వివరించారు. కొన్ని ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయని, కొందరికి ఇళ్ల ప్లాట్లు చూపించవలసి ఉందని వివరించారు.

మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. మిగిలిన ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటామని, గృహప్రవేశాలు చేసుకుని నివాసం ఉంటున్న త్రాగునీరు, విద్యుత్తు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా కాలనీలో రోడ్లు, డ్రైనేజి, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలని అధికారులను మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ఎండి యం.శివ ప్రసాదు, గృహ నిర్మాణ శాఖ పిడి జి.వి.సత్యనారాయణ, వివిధ శాఖలు అధికారులు, గ్రీన్ విలేజీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.