- పొట్టి శ్రీరాములు స్మృతివనంకు అమరావతిలో స్థలాన్ని కేటాయింపుపై కైకలూరు ఆర్యవైశ్యుల హర్షం
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

మంగళవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనంనకు అమరావతి లోని శాఖమూరి పార్క్ నందు 6.80 ఎకరముల భూమిని కేటాయించినందుకు ధన్యవాదములు తెలుపుతూ.. రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.జె.ఎస్ మాల్యాద్రి ఆధ్వర్యంలో వాని కార్యాలయం వద్ద ఆర్య వైశ్యులు పాల్గొని ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ చిత్ర పటములకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో డాక్టర్ పుల్లేశ్వరావు, మాజీ ఎంపీటీ పైడిమర్రి రాధాకృష్ణ, కృష్ణాజిల్లా మాజీ ఆర్య సంఘ అధ్యక్షుడు కొలిపాకుల వెంకటేశ్వరరావు, కైకలూరు మండల ఆర్యవైశ్యసంఘ అధ్యక్షుడు సనీశెట్టి కొండలు, మండవల్లి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు వరద శ్యామ్, ముదినేపల్లి మండల ఆర్యవైశ్య నాయకులు వత్తుమిల్లి ప్రసాద్, జవాజి గంగరాజు, తొమ్మిదవ వార్డు సభ్యులు మంచిగంటి శ్రీనివాసరావు, లక్కింశెట్టి మోహన్, వబిలి శెట్టి రాజా, పెనుమూడి గంగాధర్ రావు, కొప్పర్తి గోపాలకృష్ణ, అద్దేపల్లి బ్రహ్మాజీ, చలువది నరేంద్ర, బొగ్గవరపు శ్యామ్, సోమిశెట్టి సురేష్, ఆచంట వినయ్, గ్రంధి శ్రీనివాస్ రావు, పి రాము, కె మణికంఠ, ఎం. కిషోర్, పి. శరత్, కే .కాశి, మెంట కిషోర్, కొణిజేటి మణికంఠ, కే సుమన్ ఎస్ శరత్ వై దీపక్ నాగబాబు కే కృష్ణ కే శ్యాము ఎస్ మోహన్, కే రమేష్, ఎం నాగేశ్వరావు, ఎం శ్యాం ప్రసాద్, టి ఆనంద్, కే సునీల్, పి సునీల్, ఎం. కేశవ, వివిధ మండలాల ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు

