The Desk…Rayachoti : రాయచోటిలోని ఉగ్రవాదుల స్థావరాలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం..‼️

The Desk…Rayachoti : రాయచోటిలోని ఉగ్రవాదుల స్థావరాలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం..‼️

🔴 అన్నమయ్య జిల్లా : ది డెస్క్ :

రాయచోటిలో 30 ఏళ్లుగా స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తమిళనాడులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖి, మహమ్మద్ మన్సూరు అలీని 3 రోజుల కిందట ఐబీ అధికారులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.

ఐబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత రాయచోటి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి అనేక పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్‌కేస్ బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులపై రాయచోటి పోలీసులు వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. అబూబకర్ సిద్ధిఖి అలియాస్ అమానుల్లా, ఆయన భార్య షేక్ సైరాబానుపై ఉపా యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం, ఆర్మ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

మరో కేసులో ఉగ్రవాది షేక్ మన్సూర్ అలీ, ఆయన భార్య షమీం పైన ఇవే సెక్షన్లు వర్తింపజేస్తూ కేసులు నమోదు చేశారు. ఇవాళ షేక్ సైరా భాను, షేక్ షమీంను అరెస్ట్ చేసి రాయచోటి కోర్టులో హాజరుపరిచారు.