- పదవీ విరమణ చేస్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ.
కృష్ణాజిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయం : ది డెస్క్ :

ఉద్యోగాన్ని భారంలా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని.. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించి ఎలాంటి రిమార్కు లేకుండా, ఆరోగ్యంగా పదవీ విరమణ చెందటం అదృష్టమని.. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో గల సమావేశ మందిరంలో నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సభలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు.
▪️క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందడం అభినందనీయమని, ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించి ఎక్కడ రాజీ పడకుండా శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లకుండా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.

▪️అందరికీ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్పీ ఏఆర్ అడిషనల్ ఎస్పి సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులతో కలిసి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
▪️అనంతరం పదవీ విరమణ చెందుతున్న పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులందరితో సరదాగా కొంత సమయం గడిపే వారి కుటుంబ సంగతులను వారి పిల్లల విద్యా విశేషాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు.
పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది :
1 . SI – P. ప్రసాద్ రాజు CCS మచిలీపట్నం2 . SI – 239 Md. మస్తాన్ ఖాన్ మహిళా పోలీస్ స్టేషన్3 . ASI -149 Y. సత్యనారాయణ DTRB 4 . HC -258 T. బెనర్జీ బాబు బందర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.5 . HC -772 K. శ్రీనివాసరావు పోలీస్ కంట్రోల్ రూమ్ మచిలీపట్నం6 . ARHC – 1662 T. ఆనందరావు. ఆర్మూడ్ రిజర్వ్ మచిలీపట్నం7 . ARHC – 912 B. సుబ్బయ్య ఆర్ముడు రిజర్వ్ మచిలీపట్నం
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
▪️24 గంటలు ఉద్యోగ విధి నిర్వహణలో ఉంటూ కుటుంబానికి సమయం కేటాయించ లేనప్పటికీ ప్రజాసేవకే మీ సమయాన్ని శక్తిని వినియోగించినందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
▪️పోలీస్ శాఖలో సుమారు 40 సంవత్సరాల నుండి 43 సంవత్సరాల వరకు విధులు నిర్వర్తించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవీ విరమణ పొందుతున్నారంటే అది భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరం.
▪️మనం పోలీస్ శాఖలోకి ప్రవేశించినప్పుడే మన పదవి విరమణ సమయం తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు ఎలా పదవీ విరమణ చెందారో కొంతకాలానికి నేను కూడా రిటైర్ అవుతాను. విధి నిర్వహణలో పదవీ విరమణ అనేది సాధారణం.
▪️నిరంతరం క్షణం తీరక లేకుండా విధుల్లో ఉన్నప్పటికీ మీ పిల్లలను మాత్రం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో నడిపించారు. అందుకు మీకు మీకు సహాయకారిగా ఉన్న మీ జీవిత భాగస్వామికి అభినందనలు.
▪️ పదవీ విరమణ చెందినప్పటికీ మీరు పోలీస్ కుటుంబ సభ్యులే ఏ సహాయం కావాలన్నా ధైర్యంగా వచ్చి సంప్రదించవచ్చు
🔹అనంతరం పదవీ విరమణ చెందుతున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో ఎస్పీ స్వయంగా వారికి వడ్డించి, వారితో కలిసి భోంచేసి వారితో సమయం గడిపారు.