The Desk…Eluru : ముఖ్యమంత్రి సహాయనిధితో ఆర్థిక భరోసా : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : ముఖ్యమంత్రి సహాయనిధితో ఆర్థిక భరోసా : ఎంపీ పుట్టా మహేష్

  • 33 మందికి రూ.20.51 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ మహేష్ కుమార్.

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 33 మందికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20.51 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శాంతినగర్ లోని క్యాంప్ కార్యాలయంలో ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులుతో కలిసి సోమవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిచిన ఏడాది కాలంలో రూ.3.50 కోట్లు తమ కార్యాలయం ద్వారా బాధితులకు మంజూరు చేయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ద్వారా సేవలు పొందవచ్చని ఎంపీ పేర్కొన్నారు. అత్యవసర సమయంలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందని ఎంపీ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సమర్థవంతంగా పనిచేస్తుందని ఎంపీ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు.