The Desk…Prattipadu : మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

The Desk…Prattipadu : మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు : ది డెస్క్ :

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో అవగాహన ర్యాలీ చేపట్టారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన ర్యాలీలో నాలుగు మండలాల ఎస్సైలు, యన్ సి సి,పలు కాలేజీల విద్యార్థినీ విద్యార్థుల పాల్గొన్నారు.

ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సుమారు వెయ్యి మందితో భారీ ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వద్దు – ఆరోగ్యం ముద్దు, డ్రగ్స్ ను తరిమికొడదాం – యువతను కాపాడుదాం అంటూ నినాదాలు చేపట్టారు.

అనంతరం వైయస్సార్ సెంటర్ నందు మనవహరం చేపట్టారు. సీఐ సూర్య అప్పారావు ప్రతిజ్ఞ చేపట్టారు.ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ చట్టవిరుద్ధమైన హానికరమైన మాదకద్రవ్యాలను తీసుకోమని హామీ ఇస్తున్నామని ప్రమాణం చేయించారు.

కార్యక్రమంలో ప్రత్తిపాడు,ఏలేశ్వరం, అన్నవరం, రౌతులపూడి ఎస్సైలు ఎస్ లక్ష్మీకాంతం, ఎన్ రామలింగేశ్వరరావు, శ్రీహరి బాబు, వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, యన్ సి సి స్టూడెంట్స్ పాల్గొన్నారు.