The Desk…Kaikaluru : మత్తు పదార్థాలు వినియోగంపై కైకలూరు, ముదినేపల్లి పోలీసుల  అవగాహన ర్యాలీ

The Desk…Kaikaluru : మత్తు పదార్థాలు వినియోగంపై కైకలూరు, ముదినేపల్లి పోలీసుల అవగాహన ర్యాలీ

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గురువారం ప్రపంచ మత్తు పదార్థాల నివారణ దినోత్సవం సందర్భంగా “నష ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై.. ఏలూరు డీఎస్పీ డి . శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో.. కైకలూరు రూరల్ & టౌన్ ఇన్‌స్పెక్టర్లు రవి కుమార్, కృష్ణ , ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాంబాబు వెంకట్ కుమార్ శ్రీనివాస్, ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు లు వారి సిబ్బందితో కలిసి మత్తు పదార్థాల వినియోగ నివారణ పై అవగాహన ర్యాలీను కైకలూరు పట్టణ, ముదినేపల్లి వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులు పుర ప్రముఖులు ప్రజలు తో నిర్వహించారు.

ఈ ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీ సందర్భంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల వివరణ :👉శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టం,👉కుటుంబాల పతనం👉నేరాలు, యువత భవిష్యత్తు నాశనం వంటి అంశాలపైవిస్తృతంగా అవగాహన కల్పించారు.

ఇన్‌స్పెక్టర్ లు రవికుమార్, కృష్ణ లు మాట్లాడుతూ …“డ్రగ్స్ వినియోగం అనేది తాత్కాలిక మత్తే కానీ.. దీని ఫలితం జీవితాంతం బాధిస్తుందని.. యువత తమ విలువైన జీవితాలను మత్తు పదార్థాలకు బలి చేయకూడదన్నారు . మత్తు పదార్థాలపై శాశ్వతంగా పోరాటం చేయాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యవసరం” అని తెలిపారు.

ప్రతి దేశానికి యువత వెన్నెముకులాంటి వారిని.. అటువంటివారిని నిర్వీర్యం చేయటానికి దుష్ట శక్తులు ఇటువంటి మత్తు పదార్థాలకు యువతను గురి చేస్తారని.. పోలీసు శాఖ డ్రగ్స్ సరఫరా, వినియోగంపై గట్టి పర్యవేక్షణ జరుపుతూ ఏలూరు జిల్లా అంతటా మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు చేపడుతోందన్నారు.

ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజాన్ని మేల్కొలిపే దిశగా ముందడుగు కావాలని తెలియచేసారు.కార్యక్రమం లో కైకలూరు తహసిల్దారు, AO మరియు వారి సిబ్బంది, అలాగే కైకలూరు జూనియర్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కైకలూరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.