- “డాక్టర్ మనోజ్” జన్మదిన సందర్భంగా ప్రత్యేక కథనం
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ముదినేపల్లి మండలంలో… కైకలూరు నియోజకవర్గం లో… డాక్టర్ మనోజ్ – ఈ పేరు తెలియని వారు ఉండరు..
వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామంలో తన స్వగృహమే ఒక వైద్యశాలగా మార్చుకొని పేదలకు అందుబాటులో, అతి తక్కువ ఫీజుతో సేవలు అందిస్తూ .. తనదైన శైలిలో పేదలకు, వృద్ధులకు, అనాధలకు, ఫైర్ యాక్సిడెంట్ లో ఇల్లు కాలిపోయిన అభాగ్యులకు, ఎంతోమందికి, ఎన్నో రకాలుగా నిత్యం ఆయనకు ఒక చరవాణి సందేశం కానీ.. ఫోన్ ద్వారా గాని సహాయం కోరితే… వెంటనే అక్కడికి వెళ్లి వారికి ఆర్థికంగానూ మరియు నిత్యవసర సరుకులు ఇస్తూ ఎన్నో ఏండ్లుగా, వందల మందికి సహాయం చేస్తూనే ఉన్నారు… ఇదే డాక్టర్ మనోజ్ లైఫ్ స్టైల్..!!

ఇక విషయానికొస్తే డాక్టర్ మనోజ్ కుమార్తె అంబుల వైష్ణవి .. ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా మారుమోగుతూనే ఉంటుంది. ఎందుకంటే అతి చిన్న వయసులో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా అంబుల వైష్ణవి ఎన్నిక అవడం.. అలుపెరగని సేవా కార్యక్రమాలు.. తన తండ్రి డాక్టర్ మనోజ్ సహకారంతో వైద్య విద్యార్థినిగా కొనసాగుతూ.. తండ్రిలోని ప్రేమ, సేవాగుణం అలవర్చుకుని .. తండ్రి డాక్టర్ మనోజ్ బాటలో నడుస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డానికి కారణమైన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ జన్మదినం ఒక ప్రత్యేకమని చెప్పుకోవాలి.
ఈ సందర్భంగా ది డెస్క్ ప్రతినిధి డాక్టర్ మనోజ్ తో ఫోన్లో సంప్రదించగా… డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ… నా చిరకాల కోరిక అమరావతి రాజధానిగా త్వరగా రూపుదిద్దుకోవాలని, అమరావతి – రాజధానిగా ప్రపంచ పటంలో చిరస్థాయిగా ఉండిపోవాలని .. అదే నా కోరిక, నా స్వప్నం… అని డాక్టర్ మనోజ్ చెప్పుకొచ్చారు.

నిస్వార్ధమైన ఆయన మాటలకు, ఆయన చేసే సేవా కార్యక్రమాలకు ఎన్నో కోట్ల మంది కలల రాజధాని అమరావతి అద్భుతంగా ఉండాలని, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన ఆలోచన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!!
JUN – 24 మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా ది డెస్క్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ… రితిక ఫౌండేషన్ వారిచే నంది అవార్డుకు ఎంపికైన సందర్భంగా.. నంది అవార్డు గ్రహీత డాక్టర్ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు.