ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ కైకలూరు MPDO కార్యాలయం నందు నిర్వహించిన NREGS పధకం సామాజిక తనికి మండల ప్రజా వేదికలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగాయి. ఇది ఆక్వా ఆధారిత ప్రాంతం అవడంవల్ల పంట బోధులు మరియు మురుగు బొద్దులలో నీళ్లు ఉంటాయన్నారు. దాన్ని సాకుగా చూపి పనిచెయ్యలేదని తక్కువ గ్రాంట్ ఇవ్వటం సరికాదనీ అభిప్రాయపడ్డారు.
ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల బట్టి ఉపాధి కల్పించాలి అని అన్నారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.