కృష్ణాజిల్లా ; మచిలీపట్నం : ది డెస్క్:
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని ఉద్యోగ, కార్మిక పని 8గంటల నుండి పది గంటలు పెంపుదలకు నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నౌకల సెంటర్ లో ఒంటి కాలుపై నిలబడి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టిన నాయకులు.
ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు సాధించుకున్న హక్కులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామన్నారు కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలే అమలు చేయాలని లేని పక్షంలో వచ్చే నెల 9న దేశవ్యాప్త సమ్మె ద్వారా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా చేస్తామని హెచ్చరించారు.