ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
కొల్లేరుపై సుప్రీంకోర్ట్ నియమించిన కేంద్ర సాధికార కమిటీ ఈనెల 17, 18 వ తేదీలలో జిల్లాలో పర్యటించనుంది. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఏలూరు చేరుకొని, 1. 30 ని. ల నుండి 4 గంటల మధ్య కలకుర్రు, మణుగునూరు, ఆటపాక, కొల్లేటికోట సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కొల్లేటికోటలో కైకలూరు, ఉండి మండలాలకు చెందిన జిరాయితీ భూముల రైతులు, కొల్లేరువాసులతో సమావేశమవుతారు. అనంతరం 5 గంటలకు కొల్లేటికోట నుండి బయలుదేరి, పైడిచింతపాడు మీదుగా ఏలూరు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఏలూరు కలెక్టరేట్లో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు మండలాలకు చెందిన జిరాయితీ భూముల రైతులు, కొల్లేరువాసులు, అధికారులతో సమావేశమవుతారు. 18వ తేదీ ఉదయం 8 నుండి 12. 30 ని.ల మధ్య నిడమర్రు చేరుకొని నిడమర్రు ప్రాంతానికి చెందిన జిరాయితీ భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం ఏలూరు బయలుదేరి వెళతారు. అనంతరం ఏలూరు చేరుకొని భోజన విరామం అనంతరం విజయవాడ బయలుదేరివెళతారు.
కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబెర్ కార్యదర్శిలు డా. జె.ఆర్. భట్, జి. భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్ లు జిల్లాలో పర్యటిస్తారు.