ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ఫాదర్స్ డే… ఈరోజుకు నా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిన్న నాడే నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా తీర్చిదిద్దిన ఘనత నా తండ్రి డాక్టర్ మనోజ్ దే. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాను.. నాకు అన్నీ తానే అయి నన్ను పెంచారు. ఇతరులకు సాయం చేయడంలో ఉండే సంతృప్తిని చిన్ననాటినుంచే నాకు తెలియజేశారు. నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే పాఠశాలలు, కళాశాలలు దత్తత తీసుకుని చిన్నారుల విద్యాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చేలా చేయించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి సాయం అందించేలా చేశారు. ఆయన స్ఫూర్తితో వైద్యురాలిగా నేనూ పేదలకు నా వంతు సేవలందిస్తా…
అంబుల వైష్ణవి (అమరావతి బ్రాండ్ అంబాసిడర్ & వైద్య విద్యార్థిని) ముదినేపల్లి, ఏలూరు జిల్లా..