THE DESK NEWS :  పారిశుద్ధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేది లేదు..                       -DPO తూతిక శ్రీనివాస విశ్వనాథ్

THE DESK NEWS : పారిశుద్ధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేది లేదు.. -DPO తూతిక శ్రీనివాస విశ్వనాథ్

ఏలూరు జిల్లా, వేలేరుపాడు (ద డెస్క్ న్యూస్) : మూడవ ప్రమాద హెచ్చరిక దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్సులతో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి వరదల వలన ఇబ్బంది పడుతున్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలకు పంచాయతీ కార్యదర్సుల సహకారం చాలా అవసరం అన్నారు. రెవిన్యూ, పౌరసరఫరా, వైద్య, గ్రామీణ త్రాగునీరు, తదితర శాఖలను సమన్వయం చేసుకొని కష్టకాలంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న సివిల్ సరఫరా సరుకులు, కూరగాయలు కావల్సిన సహకారం అందించాలన్నారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాలలో ఉన్న బాలింతలు, పిల్లలు, వృద్ధులకు, దివ్యాంగులకు సరైన సౌకర్యాలు అందేలా చూడాలన్నారు.ప్రతి గ్రామాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ డయేరియా, మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికలలో భాగంగా బ్లీచింగ్, లైమ్, అబేట్, మలతీయాన్ తదితర సామాగ్రి కొనుగోలు చేసి స్టాక్ రిజర్వు పెట్టుకోవాలన్నారు. ప్రమాద హెచ్చరిక జారీచేసినందున సిబ్బంది గ్రామాలు విడిచి వెళ్ళరాదని ఆదేశించారు.దోమలు నివారణలో భాగంగా కచ్చా డ్రైన్స్ శుభ్రపర్చి అబేట్ పిచికారీ చెయ్యాలని అలాగే పొద్దుపొయినా తర్వాత గ్రామాలలో ఫాగ్గింగ్ చెయ్యాలని సూచించారు. వేలేరుపాడు, కుక్కునూరు వరద ప్రాంతాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల బాగోగులు చూసే భాద్యత కార్యదర్సులదని అన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని DPO శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.కార్యక్రమంలో డి.ఎల్.పి.ఓ రజాఉల్లాహ్, ఎంపీడీఓ శ్రీహరి, పంచాయతీ కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.