- కొల్లేరు సమస్య పరిష్కారం పై గల్లీ నుంచి దిల్లీ వరకు తన వాణీ వినిపించిన ఎంపీ మహేష్ కుమార్..
- రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి సంకల్పించిన ఎంపీ మహేష్ కుమార్..
- సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ పర్యటనకు రావడంలో కీలకపాత్ర పోషించిన ఎంపీ మహేష్ కుమార్..
- సీఈసీ పరిశీలించే అంశాలపై తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా సమర్పించడానికి నివేదిక సిద్ధం చేసిన ఎంపీ మహేష్ కుమార్..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

సహజంగా ప్రజాప్రతినిధులు సమస్యలు వింటారు కాని పట్టించుకోరనే ప్రజల అపోహను చెరిపేస్తూ పరిష్కారానికి ఎంత దూరమైన వెళ్లి బాసటగా నిలుస్తారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నిరూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ఎంపీ మహేష్ కుమార్ సంకల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొల్లేరు సమస్య పరిష్కారాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఎంపీ మహేష్ కుమార్ అవిశ్రాంత ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

హామీ ఇచ్చారు.. ఆచరణలో చూపారు.. కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆచరణలో చూపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా పోటీ బరిలో నిలిచిన పుట్టా మహేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024 ఏప్రిల్ 2న కైకలూరులో జరిగిన సభలో కొల్లేరు ప్రాంత వాసుల సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ ఘన విజయం సాధించిన సందర్భంగా 2024 జూలై 14న కైకలూరులో జరిగిన అభినందన సభలో కొల్లేరు పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు మరోసారి పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2025 జనవరి 25న కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో జరిగిన కొల్లేరు ప్రజల ఐక్యత సమావేశం సభలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొల్లేరు ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మాట ఇచ్చారు.. వెన్నంటే నిలిచారు..ఇచ్చిన మాట ప్రకారం 2025 ఫిబ్రవరి 4న కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ దేశ రాజధాని దిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని 2025 ఫిబ్రవరి 07న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కొల్లేరు సమస్య పరిష్కారం పురోగతిపై 2025 ఫిబ్రవరి 17న ఏలూరు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు.
కొల్లేరు ప్రాంత ప్రజల భయాందోళన దృష్ట్యా జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రాజధాని అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో 2025 ఫిబ్రవరి 24న జరిగిన సమావేశంలో పాల్గొని పరిస్థితి వివరించారు.
ఈ సమావేశంలో కొల్లేరు ప్రాంత వాసులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా రాబట్టారు.
లోక్ సభలో గళం వినిపించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 2025 మార్చి 27న లోక్ సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొల్లేరు ప్రాంత ప్రజల తరఫున తన గళం వినిపించారు.
కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు అభివృద్ధికి సహకరించాలని లోక్ సభ వేదికగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తదనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని సమర్పించిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు మూడు నెలలు గడువు ఇవ్వడంతో కొల్లేరు వాసులకు ఊరటనిచ్చింది. ఇదే విషయాన్ని 2025 ఏప్రిల్ 17న పత్రికా ప్రకటన ద్వారా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలియజేశారు.
సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి సమగ్ర నివేదిక. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. అధికారుల సమాచారం మేరకు సోమవారం సీఈసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. మంగళ, బుధవారాల్లో కొల్లేరు ప్రాంతంలో పర్యటించి నాలుగు అంశాలపై పరిశీలన జరపనున్నారు.
సీఈసీ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో కొల్లేరు ప్రాంత వాసులు తమ జీవనోపాధి కొరకు వారి కోరిక మేరకు జిరాయితి, డి. ఫామ్ పట్టా, మత్స్యకారుల సొసైటీ భూములు, గ్రామాల్లో మంచినీటి చెరువులు, పశువుల చెరువులు, నివేశన స్థలాలు, స్మశాన వాటికలు, ఆటస్థలాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సామాజిక అవసరాలకు సంబంధించిన భూములను పక్షుల అభయారణ్యం నుంచి తొలగించాలని కోరుతూ సమర్పించడానికి అవసరమైన సమగ్ర నివేదికను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సిద్ధం చేయించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా ఈ నివేదికలను సీఈసీ ప్రతినిధులకు సమర్పించనున్నారు.
కొల్లేరు ప్రాంత వాసులు, రైతుల మనోభావాలను గౌరవిస్తూ వారికి తగిన న్యాయం చేయాలని తన నివేదిక ద్వారా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యను ఆలకించడమే కాకుండా పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షిస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపంచారు.