- అలరించిన యోగాముద్ర ఆకృతితో ప్రదర్శన..
- ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి కళాశాలలో నిర్వహించిన విద్యార్ధుల థీమ్ యోగాకు మంచి స్పందన..
- కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, జెసి పి. ధాత్రిరెడ్డి..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి కళాశాలలో నిర్వహించిన విద్యార్ధుల థీమ్ యోగాతో హేలాపురి నగరం పులకరించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులతో ప్రదర్శించిన యోగముద్ర ఆకృతి అందరిని ఆకట్టుకుంది. విద్యార్ధినీ, విద్యార్ధుల థీమ్ యోగాకు మంచి స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ(చంటి), చింతమనేని ప్రభాకర్, జాయింట్ జెసి పి. ధాత్రిరెడ్డి, విజయవాడ ఆర్.టి.సి. రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు, దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు మామిళ్లపల్లి పార్ధసారధి, గారపాటి రామసీత, కార్పోరేషన్ కో-ఆప్షన్ మెంబరు ఎస్.ఎం.ఆర్. పెదబాబు, విద్యార్ధినీ, విద్యార్ధులతో కలిసి యోగాసనాలు వేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ.. నిత్యజీవితంలో యోగా భాగం కావాలని పేర్కొన్నారు. మనదేశ సంస్కృతిలో భాగమైన యోగా ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయన్నారు. మే 21 నుంచి జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈనెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగాదినోత్సవరం అందరూ భాగస్వాములు కావాలన్నారు.

ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 8,43,302 మంది ఎంతో ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి తమపేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఈరోజు విద్యార్ధుల థీమ్ తో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్ధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఈనెల 14వ తేదీన కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో యోగాంద్ర మాస్ డిమాన్ర్షేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ…
గత నెల రోజులుగా ప్రజలకు యోగాను పరిచయం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. యోగా మూలంగా కలిగి ఉపయోగాలను ప్రజలకు తెలియజేసి వారిలో యోగాపై ఆసక్తి కలిగించేందుకు యోగాంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. యోగాసనాలు జీవితంలో భాగం కావాలన్నారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ…
యోగాపట్ల అందరూ అవగాహన పెంచుకుని యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్య మెరుగుపరుచుకోవచ్చన్నారు. తనకు యోగాపై అవగాహన ఇప్పటివరకు లేదని యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగా వలన కలిగి ప్రయోజనాలు తెలుసుకుని తానుకూడా యోగాసనాలపై మక్కువ పెంచుకున్నానన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగాసనాలు ఒక మంచి మార్గమన్నారు. విశాఖపట్నంలో ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగాదినోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, డిఇఓ ఎం. వెంకట లక్ష్మమ్మ, సర్వశిక్షా అభియాన్ ఎపిసి కె. పంకజ్ కుమార్, ఆయూష్ డిడి లక్ష్మీసుభద్ర, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, నగరపాలక సంస్ధ కమీషనరు ఎ. భానుప్రతాప్, ఎస్సీ కార్పోరేషన్ ఈడి ఎం. ముక్కంటి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, సెట్ వెల్ సిఇఓ ప్రభాకర్, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, పర్యాటక శాఖ మేనేజరు పట్టాభి, ఏలూరు ఇన్ చార్జి తహశీల్దారు గాయత్రి, పలువురు కార్పొరేటర్లు, మానవతా తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,వివిధశాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్ధినీ, విద్యార్ధులు, ప్రజలు పాల్గొన్నారు.