The Desk…Kaikaluru : కైకలూరు జనసేన కార్యాలయంలో  “కూటమి ప్రభుత్వ ఏడాది పాలన” సంబరాలు

The Desk…Kaikaluru : కైకలూరు జనసేన కార్యాలయంలో “కూటమి ప్రభుత్వ ఏడాది పాలన” సంబరాలు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ఏపీ లో ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి గురువారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్డీఎ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా జనసేన వీర మహిళ తోట లక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ), వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, కైకలూరు మండల అధ్యక్షుడు ముమ్మారెడ్డి నాగమల్లేశ్వరరావు (నాగు) , తులసి పూర్ణచందర్రావు (పూర్ణ), పెరుగు నాగరాజు, పుప్పాల సూర్య ప్రకాష్, తోట సంజయ్ ,లక్ష్మణ్, తోట కార్తీక్, నాగరాజు, ముత్యాల తరుణ్ సాయి, తదితరులు జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.