కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన మచిలీపట్నం మంగినపూడి సాగర తీరాన అంగరంగ వైభవంగా నిర్వహించిన మసుల బీచ్ ఫెస్టివల్ – 2025 అత్యంత వైభవంగా విజయవంతంగా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా నిర్వహించబడింది.
నాలుగు రోజులపాటు నిర్వహించబడిన ఈ మసుల బీచ్ ఫెస్టివల్ బందోబస్తు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించి ఎక్కడికక్కడ బందోబస్తు పాయింట్లను ఏర్పాటుచేసి, ప్రతి పాయింట్ వద్ద నిర్నీత సిబ్బందిని ఏర్పాటు చేశారు.
▪️స్వయంగా ఎస్పీనే బందోబస్తు విధుల్లోకి దిగి మ్యాన్ ఫ్యాక్ తో ఎప్పటికప్పుడు సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడమే కాక వాహనాల మళ్లింపు చర్యలను చేపట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూశారు.
▪️ప్రజల కు అసౌకర్యం కలగకుండా వాహనాలు నిలిచిన సమయంలో వారితో సరదాగా ముచ్చటించి వారి యొక్క సమాచారం తెలుసుకొని సరదాగా వారితో సమయం గడిపారు.
▪️ జిల్లా అధికారి అనే స్థాయి భేదం లేకుండా సిబ్బందితో కలిసిపోయి విధుల్లో నిమగ్నమై సిబ్బంది యొక్క పని భక్తులను తగ్గించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు.
▪️నాలుగు రోజులపాటు జరిగిన ఈ బీచ్ ఫెస్టివల్ ను పకడ్బందీగా బందోబస్తు నిర్వహించి, సుదూర ప్రాంతాల నుండి ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజలకు అసౌకర్యం కలగకుండా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చూసినందుకు, జిల్లా ఎస్పీ గారు, సిబ్బంది అందరికి ప్రతి ఒక్కరికి కరచాలనం అందించి అభినందనలు తెలియజేశారు.
▪️ఇదే స్ఫూర్తిని మునుముందు కొనసాగిస్తూ పటిష్ట బందోబస్తు మరెన్నో చేసే కృష్ణాజిల్లా పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టను పెంపొందించాలని సిబ్బందిలో నూతన ఉత్సాహాన్ని నింపారు.