The Desk…Eluru : యోగాంధ్రలో జిల్లా జలవనరుల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది

The Desk…Eluru : యోగాంధ్రలో జిల్లా జలవనరుల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

యోగాంధ్రలో జిల్లా,వివిధ మండలాలు జలవనరులు శాఖ అధికారులు, ఉద్యోగులు,సిబ్బంది సుమారు 90 మంది పాల్గొన్నారని జిల్లా జలవనరులు శాఖ అధికారి పి.నాగార్జున రావు తెలిపారు.యోగాంద్ర మాసవేడుకలు కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం స్ధానిక వట్లూరు టిటిడిసిలో నిర్వహించిన యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొని యోగా అభ్యాసనాలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా జలవనరులు శాఖ అధికారి పి.నాగార్జున రావు మాట్లాడుతూ…యోగా అందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు వస్తాయన్నారు.యోగాతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై తెలిసినవారు తెలియనివారికి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.యోగా ఆసనాలతో మంచి ఆరోగ్యంతో పాటు చేస్తున్న వృత్తిలో చురుకుగా పాల్గొని సంతృప్తిని పొందుతారన్నారు. యువత చదువు,ఆటలు,పాటలు, అన్నింటిలో చురుకుగా ఉంటూ మంచి ఫలితాలను సాధించుతారని అన్నారు.

ఏపి ఎన్జీవో అసోసియేషన్ నాయకులు సి.హెచ్.శ్రీనివాస రావు మాట్లాడుతూ… ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో, కార్యాలయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారని,యోగా ఆసనాలు అలవాటు చేసుకుని ఒత్తిడిని తట్టుకుని పని చేయడానికి యోగాభ్యాసం దివ్య ఔషధం లాగా పనిచేస్తుందన్నారు.సుమారు 197 దేశాల్లో యోగాను అనుసరిస్తూ కోట్ల మంది ప్రజలు మానసికఉల్లాసం పొందుతున్నారని,యోగాంధ్ర కార్యక్రమం ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుందని, అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఈ నెల 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయాలని కోరుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళుతున్న భారత ప్రధాని నరేంద్రమోడి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా జలవనుల శాఖ డిప్యూటి సూపర్డెంటు పి.ధనంజేయులు ,ఇఇలు దేవ ప్రకాష్,జగదీష్, కె.రాజు,ఏపి ఎన్జీవో అసోసియేషన్ నాయకులు సి.హెచ్.శ్రీనివాసరావు,వివిధ మండలాల జలవనరుల శాఖ అధికారులు,ట్రైనర్స్, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.