ది డెస్క్ న్యూస్: 02-06-2025 ఏలూరు జిల్లా చింతలపూడిలోని గ్రావిటీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ గ్రావిటీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించి అనతి కాలంలో (సంవత్సరంనర) వివిధ పోటీ పరీక్షలలో అత్యధిక స్థాయిలో విజయాలు సాధించి చింతలపూడిలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నరు.గ్రావిటీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థుల విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు నిర్వహించిన ర్యాలీ విద్యార్థుల నినాదాలు, ప్రదర్శనలు, వారి ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.
2025 సంవత్సరంలో గ్రావిటీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు సాధించిన ఘన విజయాలు:
ఆల్ ఇండియా సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్షలో 227/300 మార్కులు మరియు 14,000 ర్యాంక్ సాధించారు.
10 నవోదయ స్కూల్ సీట్లు గెలుచుకున్నారు
13 మంది విద్యార్థులు ఏకలవ్య ప్రవేశ పరీక్షలో ఎంపికయ్యారు,
21 మంది విద్యార్థులు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలలో ప్రవేశం పొందారు.
ఈ ర్యాలీ సందర్భంగా ప్రజలు విద్యార్థుల ప్రతిభను చూసి మెచ్చుకున్నారు. వారి ప్రదర్శనలు చింతలపూడి వీధులలో సందడి చేశాయి. ఇది కేవలం విద్యలోనే కాదు, వారి ధైర్యంలోనూ, నైతిక విలువలలోనూ ఉన్న బలాన్ని చూపించింది.
గ్రావిటీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ స్థాపకులు మరియు సిబ్బంది ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడంలో ఎంతో గర్వంగా భావిస్తున్నారు.
గ్రావిటీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డి.మనోహర్ జోషి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పర్యవేక్షణ మా ప్రత్యేకత “మా లక్ష్యం నాణ్యమైన విద్యను ప్రతి గ్రామానికి తీసుకెళ్లడం, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి విజయం అందించడం” విద్యార్థులు ఎలా ఉన్నా వారిని తీర్చిదిద్ది వారికి చక్కని విజయాలను అందించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు