- రమేష్ కుటుంబ సభ్యులను కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిసి పరామర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
తెలుగుదేశం పార్టీ కైకలూరు నియోజకవర్గం కో కన్వీనర్, టెలికం బోర్డు సభ్యుడు తేరా రమేష్ తుది శ్వాస వరకు టిడిపి బలోపేతం కోసం పనిచేశారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఇటీవల కన్నుమూసిన తేరా రమేష్ కుటుంబ సభ్యులను కైకలూరు మండలం యామవరప్పాడులోని నివాస గృహంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సోమవారం పరామర్శించారు.
రమేష్ కుటుంబ సభ్యులను ఓదార్చిన కామినేని, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లు తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. తేరా రమేష్ చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, కామినేని లు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తేరా రమేష్ చేసిన సేవలను గుర్తు చేశారు. టిడిపి సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన తేరా రమేష్ మృతి తమను తీవ్రంగా కలిచి వేసిందని.. నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.