కృష్ణా జిల్లా : మోటూరు : ది డెస్క్ :
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ శనివారం మోటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీలో వైద్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాట్లాడుతూ.. ఆహారపు నియంత్రణ వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని, ప్రతినెల రక్తపోటు మరియు తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన అధిక రక్తపోటును గుర్తించి తగిన చికిత్స అందించి అనారోగ్య సమస్యలను ప్రారంభంలోనే నియంత్రించి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా కార్యక్రమ నిర్వహణాధికారులు డా.హిమబిందు, డా. మహేష్ మోటూరు ప్రాథమిక వైద్యాధికారులు డా. దీప్తి, తేజ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.