The Desk…Kaikaluru : ఘనంగా జాన్ విక్టర్ పుట్టినరోజు వేడుకలు

The Desk…Kaikaluru : ఘనంగా జాన్ విక్టర్ పుట్టినరోజు వేడుకలు

  • మాజీ ఎమ్మెల్యే డీఎన్నార్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ కార్యదర్శి, ప్రముఖ ఆప్తమాలజిస్ట్, పలు రంగాల్లో తన పరిధిలో విశేష సేవలందించిన గరికిముక్కుల జాన్ విక్టర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం జాన్ విక్టర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైకాపా అద్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)తోపాటు విక్టర్ అభిమానులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పలు చోట్ల పుట్టిన రోజు సంద్భంగా కేక్ లు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మరికొంతమంది నేరుగా విక్టర్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపగా.. ఇంకొంతమంది ఫోన్లోను, పలువురు సోషల్ మీడియా వేదిక ద్వారా జాన్ విక్టర్కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తించారు.

జాన్ విక్టర్ పార్టీ అధిష్టానం ఆదేశాలు, స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైకాపా అద్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్), వారి తనయుడు వినయ్, శ్యామ్ ల సూచనల మేరకు నియోజకవర్గంలో వైకాపాను బలోపేతం చేయడంతోపాటు తనదైన శైలిలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఐక్య క్రిస్మస్ వేడుకల నిర్వహణలో జాన్ విక్టర్ది కీలక భూమిక అని చెప్పాలి. ఇక వైద్యరంగంలోనూ విక్టర్ తనసేవలతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించారు.

ఆప్తమాలజిస్టుగా ఎంతోమంది రోగులకు వారివారి ఆర్ధిక స్థితినిబట్టి వైద్య సేవలందించటంలోను, కంటి ఆపరేషన్లు, కళ్లజోళ్లు పంపిణీ, నేత్ర సంబంధిత వ్యాధులకు వైద్యసాయమందిస్తూ తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి జాన్విక్టర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లుతూ రాజకీయంగా మంచిస్థాయికి చేరుకోవాలని, ప్రజాసేవ, వైద్యసేవలు చేసేందుకు జాన్విక్టరు భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును, శక్తిని అనుగ్రహించాలని ఆకాంక్షించారు.

అనంతరం జాన్విక్టర్ మాట్లాడుతూ.. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన, పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.