ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ వ్యాధిని నివారించుటకు తీసుకోవలసిన జాగ్రత్త, చర్యల పైన అవగాహన నిమిత్తము మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గురజ నుండి గురజ గ్రామంలో వైద్యాధికారిణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది. డెంగీ వ్యాధి నివారణ నిమిత్తము ఇంటి చుట్టుపక్కల పరిసరాలను నీరు నిలవ లేకుండా ఉంచుకోవాలి. గ్రామములో ప్రతి ఒక్కరూ ఫ్రైడే రైడేను ఆచరించాలి.
ఇంటి చుట్టు ప్రక్కల పరిసరాలలో పాత టైర్లు, పగిలిపోయిన కుండలు, జాడీలు నీరు నిలవ ఉండేటువంటి ప్లాస్టిక్ డబ్బాలు ఇంటి పరిసరాలలో లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి వద్ద నీరు నిల్వ ఉంచుకునే నీటి బిందెలు, తొట్టెలు, డబ్బాలపై తప్పనిసరిగా మూతలు ఉంచాలి. ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలి. దోమకాటు వ్యాధులనుంచి రక్షణ పొందాలి.
కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్. కే. జోనతాన్, హెల్త్ సూపర్వైజర్ రహీం, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.