The Desk…Vijayawada : CBSE 10వ తరగతి పరీక్షల్లో జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయం సాధించిన వై. మోక్షజ్ఞ

The Desk…Vijayawada : CBSE 10వ తరగతి పరీక్షల్లో జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయం సాధించిన వై. మోక్షజ్ఞ

  • తండ్రి న్యాయమూర్తి, తనయుడు సరస్వతి పుత్రుడు
  • ఈదు మోక్షజ్ఞ పదో తరగతి పరీక్షల్లో జాతీయస్థాయి
  • విద్యార్థిని, విద్యార్థులు, మోక్షజ్ఞ ను స్ఫూర్తి గా తీసుకోవాలి

🔴 ఏలూరు /విజయవాడ : ది డెస్క్ :

ఇటీవల విజయవాడ ఎన్.ఎస్టీ మాథ్యూస్ విద్యాలయం తరుపున CBSE పదో తరగతి పరీక్షలకు హాజరైన ఈదు మోక్షజ్ఞ కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. మోక్షజ్ఞ తండ్రి శ్రీనివాసరావు ఏలూరు కుటుంబ తగాదాల న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. తల్లి మాధవి గృహిణి కాగా, మోక్షజ్ఞ సోదరుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. పరీక్షల్లో అత్యంత ఉన్నత స్థాయి అందుకున్న మోక్షజ్ఞ కు పాఠశాల యాజమాన్యం అభినందనలతో ముంచెత్తింది. ▫️ఇంగ్లీష్ : 096 ▫️తెలుగు : 080 ▫️గణితం : 071 ▫️శాస్త్రం : 062 ▫️సైన్స్ : 083 ▫️ఐటీ : 086 మార్కులు సాధించగా…పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు మోక్షజ్ఞ ను అభినందిస్తూ… విద్యార్థిని, విద్యార్థులంతా మోక్షజ్ఞను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థి మోక్షజ్ఞ మాట్లాడుతూ..

ఈ విజయానికి ప్రోత్సాహం తన తల్లిదండ్రులదేనని, ఆది నుండి మా విద్యాలయ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వెన్ను తట్టి తన విజయానికి ప్రధాన కారణం అయ్యారని అన్నారు. గతంలో కూడా నాలుగో తరగతిలో గణిత ఒలంపియాడ్ లో దేశవ్యాప్తంగా రెండవ స్థానాన్ని గెలుచుకోవడం కూడా తనకెంతో సంతోషకరమనిపించిందని, భవిష్యత్తులో ఈ విధమైన విజయాలు సాధిస్తూ న్యాయ వ్యవస్థలో మహోన్నతమైన పదవులు పొందడమే కాకుండా, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో నిలవడానికి తన వంతు కృషి చేస్తానని, అదే నా జీవితాశయమని వెల్లడించారు.