The Desk…”ఆపరేషన్ సింధూర్” సందర్బంగా… మాజీ సైనికునితో “ది డెస్క్” ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ

The Desk…”ఆపరేషన్ సింధూర్” సందర్బంగా… మాజీ సైనికునితో “ది డెస్క్” ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఆపరేషన్ సింధూర్” సందర్బంగా… మాజీ సైనికునితో “ది డెస్క్” ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ ….

1) మీ నేపథ్యం..❓

నా పేరు తూతిక శ్రీనివాస విశ్వనాధ్, ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా డీపీఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్, ప్రకాశం జిల్లాలో కూడా పనిచేసాను. ప్రస్తుతం మారేడుమిల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా సేవలందిస్తున్నాను. స్వగ్రామం ఉప్పాడ కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా.

2) భారత సైన్యంలో ఎంత కాలం పనిచేసారు..❓ ఎక్కడెక్కడ పనిచేసారు..❓

నాకు 18 సంవత్సరాలు వయస్సులోనే 1989లో భారత నౌకాదళంలో మెట్రిక్ ఎంట్రీ రిక్రూట్ గా చేరాను. 15 సంవత్సరాలు ఇండియాన్ నేవీకి సేవలు అందించి 2004లో పి.ఓ.ఈ.ఎల్.ఆర్ ర్యాంకులో రిటైర్ అయ్యాను. ఇండియన్ నేవీలో ముంబై కేంద్రంగా ఉన్న వెస్ట్రన్ నావల్ కమాండ్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్, ఐఎన్ఎస్ సావిత్రీ, ఫ్రీగెట్ క్లాస్ నౌక ఐఎన్ఎస్ గోమతి యుద్ధ నౌకలలో పనిచేసాను. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న లాండింగ్ క్రాఫ్ట్ యూటీలిటీ ఎల్.సి.యు 36, ఐఎన్ఎస్ కళింగ తదితర నౌకలలో పనిచేసాను. నా సేవకాలంలో ఆపరేషన్ స్వాన్, ఆపరేషన్ తాషా పరిధిలో నావల్ డేటాచ్మెంట్ 32లో సేవలు అందించాను.

3) కేంద్రం తీసుకున్న “ఆపరేషన్ సింధూర్” పై మీ అభిప్రాయం..❓

దేశంలో శాంతి స్థాపనకు ఆపరేషన్ సింధూర్ అనేది ఒక గొప్ప సైనిక చర్య. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి అలాగే దేశంలో ఉన్నా ప్రతి భారతీయుడు భారత సైన్యానికి మద్దతుగా నిలవాలి. ఎందుకంటె శాంతిని కోరుకునే భారతదేశానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా తయారయ్యింది. గత నెల ఏప్రిల్ 22న పెహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక భారత పౌరులు, నేపాల్ దేశానికి చెందిన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దీనిని కేవలం కొంతమంది మీద దాడిగా భావించడం కాదు యావత్ దేశం మీద దాడిగా భావించాలి ఎందుకంటె పార్లమెంట్ మీద దాడి తర్వాత, ముంబై ఉగ్రవాదులు దాడి తర్వాత పహాల్గామ్ ఘటన మారణఖాండ ద్వారా ఉగ్రవాదులు మన దేశానికి ఒక సందేశాన్ని పంపించారు ఉగ్రమూలాలు ఇంకా బ్రతికే ఉన్నాయి మా నుంచి మీకు ముప్పు ఉందని ఒక సవాల్ విసిరారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మన దేశానికి మంచిది కాదు. ఎందుకంటె అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత దేశం ఎదుగుతుంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఇది ఓర్వలేక మన శత్రుదేశం ఉగ్రవాదులకు ఆసరా కల్పిస్తూ కవ్వింపు చర్యలకు పాటుపడుతుంది. అందుకనే కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ సరిహద్దులలో ఉన్నా టెర్రరిస్ట్ శిభిరాలుపై మిలిటరీ దాడి చేసి మనసత్తా చాటింది. ఉగ్రవాదులను, ఉగ్రవాదుల శిభిరాలను పూర్తిగా అంతమోందించే వరకు ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి.

4) భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..❓

భారత్ ప్రపంచానికి విశ్వగురువు, ప్రపంచంలో భారత్ చాలా శక్తి వంతమైన దేశం. గతంలో మన సైనిక సత్తా పాకిస్తాన్ చాలాసార్లు చవిచూసింది. 1971లో, కార్గిల్ ఆపరేషన్ లో పాకిస్తాన్ ని భారత్ ఏవిధంగా ఓడించిందో ప్రపంచానికి తెలుసు. సర్జకల్ స్ట్రైక్స్ తో ఉగ్రస్థావరాలుపై దేశం నూతన వరవడికి శ్రీకారం చుట్టి ప్రపంచాన్ని నివ్వేర పరిచింది. మనదేశ ఆర్మీ, వాయుసేన, నౌకదళం శక్తి పాకిస్తాన్ తో పోలిస్తే చాలా శక్తి వంతమైనది. మన ఇంటలిజెన్స్, ఆధునిక సమాచార వ్యవస్థ ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నవి. మన యుద్ధసామాగ్రి పాకిస్థాన్ తో పొలిస్తే అత్యాధునికమైనవి, మనదేశంలో త్రివిధ దళాలు మధ్య సమన్వయం (మిలిటరీకోఆర్డినేషన్) చాలా బాగుంటుంది. ముఖ్యంగా మన దేశ సైనికులకు దేశభక్తి ఎక్కువ ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడతారని ప్రపంచానికి తెలుసు. భారత వాయుసేనాలో పనిచేస్తున్న గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్తమాన్ తెగువను గతంలో మనందరం చూసాం. మనదేశంలో సైనికులు అందరు అదే తెగువతో సేవలందిస్తారు. అందువలన భరత్ తో పూర్తిస్తాయి యుద్దానికి పాకిస్తాన్ తెగబడదు. కాకపోతే అంతర్జాతీయ సమాజం ముందు మేకపోతు ఘాంభిర్యం చూపించాలి కాబట్టి సరిహద్దులలో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. వాటిని మన సైనికులు ధీటుగా సమాధానం చెప్తారు.

5) ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంటుంది..❓

ప్రపంచంలో అన్ని దేశాలు ఉగ్రదాడులను, ఉగ్రవాదులను వ్యతిరేకిస్తారు. అయితే జెషే మహ్మద్, లాస్కర్ ఏ తోయిబా అను ఉగ్రసంస్థలను పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని ప్రపంచానికి తెలుసు. భారత్ కూడా అనేక సందర్భాలలో, ప్రపంచ వేదికలు మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆధారాలతో సహా నిరూపించి ప్రపంచ దేశాల మద్దతుగా కూడగట్టుకుంది. సైనిక అగ్రరాజ్యాలు అయిన రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ తో పాటు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ముస్లిం దేశాలు కూడా భారత్ కు దౌత్య పరంగా మద్దతుగా నిలుస్తాయి. ప్రపంచంలో ఉన్నా దేశధినేతలతో మన దేశానికి ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్రమోడీకి స్నేహ సంబంధాలు మేరుగ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిగా జనాభా కలిగిన మన భారత దేశం ప్రపంచ వాణిజ్య కేంద్రంగా, ఆర్ధిక కేంద్రంగా ఎదిగింది. అలాగే భారత్ తో అన్నిదేశాలకు సత్సంభందాలు బాగున్న కారణంగా, భారత్ కు శాంతికాముక దేశంగా పేరుండడం వలన ప్రపంచ దేశాల మద్దతుగా సహజంగా భారత్ కె ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది భారత ఉగ్రపోరులో న్యాయం ఉందని ప్రపంచదేశాలు నమ్ముతున్నాయి అందుకనే భారత్ పాకిస్తాన్ పోరులో పాకిస్తాన్ ఏకాకి అయ్యింది.

6) ఆపరేషన్ సిందూర్ కేంద్రం ప్రకటించిన సందర్భంలో పౌరులు ఏవిధంగా ఉండాలి ..❓

కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయానికి పౌరులు అందరు మదత్తు పలకాలి, అన్ని వ్యవస్థలు సంఘీభావం ప్రకటించాలి, కులాలకు, మతాలకు అతీతంగా ఈ సమయంలో దేశం ఒక్కటే అన్న భావన అందరిలో ఉండాలి, భిన్నాభిప్రాయాలకు స్వస్తి పలికి అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు పూర్తి మద్దతుగా నిలవాలి, శత్రు దేశాలు లేదా కొంతమంది వ్యక్తులు సామాజిక మధ్యమాలలో తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టించ వచ్చు అటువంటి వాటిని నమ్మకూడదు.

ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పౌరుల ప్రవర్తన ఉండాలి ప్రభుత్వ అధికారుల విధులకు ముఖ్యంగా యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించకూడదు. ఫేక్ న్యూస్ ను అసలు నమ్మవద్దు. అంబులెన్సు, అగ్నిమాపక, మిలిటరీ వాహనాలకు అడ్డుపడకుండా దారినివ్వాలి, పూకార్లు సృష్టించకూడదు, నమ్మకూడదు, అప్రమత్తంగా ఉంటూ సమాచారాన్ని పక్కాగా కంఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ఇతరులతో పంచుకోవాలి, భారత సైన్యానికి, భద్రత దళాలకు విధేయతగా సంఘీభావంతో ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే పిలుపు మేరకు సేవ కార్యక్రమాలలో పాల్గొనాలి, అత్యవసర సమయంలో దేశం ఋణం తీర్చుకునే అవకాశం వచ్చిందని భావించి భారతీయులు అందరు ఆలోచనలో, ఆచరణలో ఐక్యత ప్రదర్శించాలి.