The Desk…Eluru : ఈ నెల 20న దేశవ్యాప్తసార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి  ➖భజంత్రీ శ్రీనివాసరావు

The Desk…Eluru : ఈ నెల 20న దేశవ్యాప్తసార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి ➖భజంత్రీ శ్రీనివాసరావు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఈ నెల20న దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఏలూరు జిల్లా కార్యదర్శి బజంత్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న 17వ సర్కిల్ కార్యాలయం వద్ద సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఆప్కాస్ఉద్యోగ కార్మికులకు కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అపరిస్కృతంగా ఉన్న ఉద్యోగ, కార్మికుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో రాజకీయ జోక్యాలు అధికమయ్యాయని, పలుచోట్ల కార్మికుల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారితే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు చేపడతామని ఎన్నికల్లో ఏమైనా తెలిపారా..? అని ప్రశ్నించారు.

మున్సిపల్ రంగంలో ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నంబరు 36 ప్రకారం వేతనాల పెంపు జరపాలని డిమాండ్ చేశారు.ఈనెల 20న జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో యూనియన్ సభ్యులు ఏ. ప్రసాదు,బట్టు నాగబాబు, కనకరాజు, లోకేంద్ర, చిరంజీవి,శ్యామ్ కుమార్,మీసాల చంద్రమౌళి,రత్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.