The Desk…Vijayawada, Mylavaram : జాతీయ స్థాయి ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్ పోటీలో NTR జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయి విజేతలగా విజయం

The Desk…Vijayawada, Mylavaram : జాతీయ స్థాయి ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్ పోటీలో NTR జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయి విజేతలగా విజయం

  • – జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ను కలిసిన విజేతలు

🔴 ఎన్టీఆర్ జిల్లా : ది డెస్క్:

ముంబయిలో ఏప్రిల్ 23 న దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల నుండి విద్యార్థులు పాల్గొన్న జాతీయ స్థాయి ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం కన్నిమెర్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి విజయం సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చారు.

ఈ పోటీలో మొత్తం 2నుండి 5 వ తరగతి వరకు 4 విభాగాలలో పోటీలు నిర్వహించబడ్డయి, వీటిలో 4వ తరగతి విభాగం లో 4వ తరగతి విద్యార్థి రేవంత్ ప్రథమ స్థానం (1st Place), 2 వ తరగతి విభాగం లో 2వ తరగతి విద్యార్థిని సింధు ప్రియా ద్వితీయ స్థానం (2nd Place) సాధించారు. ఈ పోటీలలోఆంధ్ర ప్రదేశ్ మొత్తం మీద ఓవరాల్ ఛాంపియన్ షిప్ పొందడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజేతలైన విద్యార్థులను అభినందించి బహుమతులు అందచేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి (DEO) U.V. సుబ్బారావు , APC శ. G. మహేశ్వర రావు , విభా ఫౌండేషన్ నుండి వీరనారాయణ , Leap For Word (LFW) సంస్థ నుండి విజయ్ కుమార్ , సమగ్ర శిక్ష AMO అశోక్ బాబు పాల్గొన్నారు.

పాఠశాల ఉపాధ్యాయుని విజయలక్ష్మిని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అభినందించి సన్మానించారు. తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయిని జాతీయ ఉత్తమ ప్రదర్శనకు గాను విద్యార్థులకు ప్రశంసలు వెల్లువెత్తాయి మరియు తల్లి తండ్రులకు అభినందనలు తెలియజేశారు.

ఈ విజయానికి పునాది వేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు ప్రభుత్వ విద్యా సంస్థల కృషి అభినందనీయమని APC G. మహేశ్వరరావు తెలియచేశారు.మైలవరం మండలం నుండి విద్యార్థులు దేశ స్థాయిలో వెలుగొందడం స్థానికంగా గర్వకారణంగా మారింది.