- సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ మహేష్ కుమార్ ఆదేశం
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం ఉదయం స్థానిక క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఎంపీ మహేష్ కుమార్ అర్జీలు స్వీకరించారు. పలువురు వ్యక్తిగత, మరికొందరు సామాజిక సమస్యలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు.
ప్రజల నుంచి తనకు వచ్చిన అర్జీల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిధులతో సంబంధం ఉన్న సమస్యల పరిష్కారానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదన నివేదిక పంపించాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు.