🔴 అమరావతి : ది డెస్క్ :
తాను ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు, వారి హృదయాల్లో స్థానం పొందేందుకు తెలుగుభాష చక్కటి మాధ్యమంగా పనిచేసిందని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు భాషలోని మాధుర్యం ఇతర భాషల్లో తక్కువని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 2026లో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచారపత్రికను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. తాను ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు, వారి హృదయాల్లో స్థానం పొందేందుకు తెలుగు భాష చక్కటి మాధ్యమంగా పనిచేసిందని తెలిపారు. తెలుగు మహాసభలకు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించాలన్న నిర్వాహకుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగువారి సాహితీ, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహిస్తామని సారస్వత పరిషత్తు అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ చెప్పారు.