The Desk…Kaikaluru : వేమవరప్పాడు ఆరెస్కేలో ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన

The Desk…Kaikaluru : వేమవరప్పాడు ఆరెస్కేలో ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

మండలంలోని వేమవరప్పాడు గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ గ్రామసభ మండల ఇన్చార్జి అహోబలరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎన్ ఎఫ్ ఏ మధు బాబు పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలు పిఎండిఎస్ పచ్చిరొట్ట పెంపకం దాని ఉపయోగాలు తెలియజేశారు.

గ్రామ వ్యవసాయ అధికారి, సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు పిఎండిఎస్ విత్తనాలు వేయాలని.. అందరూ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని సూచించారు. గతంలో ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులు వారి అనుభవాలను వారు పొందిన లబ్ధిని ఈ సందర్భంగా తోటి రైతులకు తెలియజేశారు.

కార్యక్రమంలో మాజీ సెక్రటరీ ప్రసాద్, వి ఏ ఏ గోపీనాథ్, రైతులు జయరాజు , తలారి విజయ్, వెంకట రాంబాబు, బోడవల రాంబాబు, సల్మాన్ రాజు, ప్రవీణ్, శ్రీనివాసరావు, రాజేష్, నున్న శ్రీనివాసరావు, అంగన్వాడి సిబ్బంది దుర్గ భవాని, సౌమ్య రేవతి, బుక్ కీపర్ యశోద, కైకలూరు కలిదిండి మండలాల ఐసిఆర్పీలు పాల్గొన్నారు.