The Desk…Thulluru : అమరావతి పునర్నిర్మాణ సభను విజయవంతం చేయాలి : అయినవోలు రచ్చబండ సభలో మంత్రి నాదెండ్ల పిలుపు

The Desk…Thulluru : అమరావతి పునర్నిర్మాణ సభను విజయవంతం చేయాలి : అయినవోలు రచ్చబండ సభలో మంత్రి నాదెండ్ల పిలుపు

  • అపోహలొద్దు -29 గ్రామాలను అభివృద్ధి చేస్తాం
  • 60 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపన

🔴 గుంటూరు జిల్లా : తుళ్లూరు మండలం : ఐయినవోలు : ది డెస్క్ :

ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా 34000 ఎకరాలను 50 రోజుల్లోపు నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణానికి అందించారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐయినవోలు గ్రామం రామాలయం సెంటర్ వద్ద రచ్చబండ కార్యక్రమం జరిగింది.

రచ్చబండలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ఈనెల రెండవ తేదీ అమరావతిలో జరుగబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు, చైతన్యం కలిగిన ప్రజలు…. ప్రధాని సభను విజయవంతం చేయాలన్నారు..

ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వం పరిపాలన అనుభవం లేని ప్రభుత్వం గా, ప్రజల నమ్మకాన్ని కోల్పోయినదిగా పేర్కొన్నారు.

కావాలనే విధ్వంసానికి పాల్పడి, అభివృద్ధికి ఆటంకాలు కలిగించిందని విమర్శించారు. అప్పటి పాలకులు ప్రాజెక్టులను నిలిపివేసి, రోడ్లను తవ్వించి, కేబుల్‌లను ఎత్తుకుపోయారన్నారు.ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగని విధంగా, భారత ప్రధాని రెండవసారి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రావడం గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి మరో కీలకమైన మైలురాయిగా పేర్కొన్నారు.

అమరావతి రైతులు త్యాగాలు ఫలితమే కూటమి ప్రభుత్వ ఏర్పడడానికి కారణం అన్నారు.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 29 గ్రామాలను అభివృద్ధికి భరోసా ఇచ్చారు.. ఒక నగరం అభివృద్ధి జరగాలంటే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ రావాలన్నారు …. మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, టిడిపి జనసేన బిజెపి నాయకులు, ఎర్రబాలెం, బేతపూడి, అయినవోలు గ్రామాల ప్రజలు, కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.