The Desk…Kaikaluru : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాంకులు సాధించాలి : ఎమ్మెల్యే డా. కామినేని

The Desk…Kaikaluru : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాంకులు సాధించాలి : ఎమ్మెల్యే డా. కామినేని

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా చదువులో ఉత్తమ ర్యాంకులు సాధించాలని కైకలూరు శాసనసభ్యుడు డా.కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం కామినేనిని ఆయన ఇంటివద్ద ఇటీవల జరిగన పదవ తరగతి పరీక్షలలో ఉత్తిర్ణత సాధించిన లింగాల గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థి బాస ధీరజ్ సాయి విశాల్ కలిశారు. 587 మార్కులతో సాయి విశాల్ ఏలూరు జిల్లాస్థాయి రెండవ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్బంగా శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ విశాల్ ను అభినందించారు.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇలా ర్యాంకులు సాధించటం హర్షనీయం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలల స్థాయిలో యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్, అందించి పిల్లలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉండాలని.. ప్రభుత్వం అందించే పధకాలను విద్యార్థులందరు సధ్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.