The Desk…Eluru : పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి కలచివేసింది : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి కలచివేసింది : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయకులు చనిపోవడం, వారిలో ఇద్దరు తెలుగువారు ఉండటం తనను కలిచివేసిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు దాడికి పాల్పడటం హేయమైన చర్యగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభివర్ణించారు. కాశ్మీర్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా దాడికి తెగబడిన ఉగ్రవాదుల పట్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించబోదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.

పహల్గాం ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఎంపీ పేర్కొన్నారు. పహల్గాం ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ఎంపీ మహేష్ కుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రమూకల దాడిలో చనిపోయిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు.