The Desk…Eluru : సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించడం శుభ పరిణామం

The Desk…Eluru : సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించడం శుభ పరిణామం

  • కొల్లేరు సమస్య పరిష్కారానికి మొదటి అడుగు పడింది.
  • ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వాల కృషి ఫలించింది.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.

ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

కొల్లేరు ప్రాంత ప్రజల వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు మూడు నెలలు వెసులుబాటు కల్పించడం శుభ పరిణామం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి మొదటి అడుగు పడిందని ఎంపీ పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో తనతో పాటు కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలిసి చేసిన కృషి ఫలించిందని ఎంపీ స్పష్టం చేశారు.

కొల్లేరు సరిహద్దులు నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు చేపట్టిన చర్యలతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురికావలసిన పరిస్థితిని ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వివరించడం జరిగిందని ఎంపీ తెలిపారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చారని ఎంపీ వెల్లడించారు.

కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసా మేరకు సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగిందని ఎంపీ తెలిపారు. కొల్లేరు ప్రజల వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తం చేస్తూ మూడు వారాల గడువు ఇవ్వడం ఊరట లభించిందని ఎంపీ పేర్కొన్నారు.

సమగ్ర వివరాలతో జిల్లా కలెక్టర్ నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో సమర్పిస్తారని ఎంపీ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వాలు కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాయని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు.