🔴 ఏలూరు జిల్లా: కైకలూరు : ది డెస్క్ :

కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలిసి పాల్గొన్న ఎంపీ మహేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలైన కార్యకర్తలకు అండగా ఉంటామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు.
కైకలూరులోని కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి జరిగిన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో.. ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ… కైకలూరు నియోజకవర్గం తెదేపా శ్రేణులు సభ్యత్వ నమోదులో ముందుండి అధిష్టానం వద్ద తమ పరపతి పెంచారని, సభ్యత్వ నమోదులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఎంపీ మహేష్ కుమార్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
కైకలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిని నియమించాలనే కార్యకర్తల మనోభావాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ విజయంలో భాగస్వాములై, కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు పదవుల విషయంలో అధిష్టానం తగిన న్యాయం చేస్తుందని ఎంపీ తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు ఏవైనా సమస్యలు ఉంటే తన కార్యాలయం అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.
ఏలూరు పార్లమెంటును అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇక్కడి సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి నిధులు రాబట్టేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పలు సమస్యలపై ప్రజల తరఫున లోక్ సభలో తన గళం వినిపించానని, అదే సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఎంపీ తెలిపారు.
అలాగే కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యేలతో కలిసి తమవంతు ప్రయత్నం చేస్తున్నామని, కొంత జాప్యం జరిగిన, కొల్లేరు ప్రజలకు మాత్రం న్యాయం చేస్తామని ఎంపీ మహేష్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డులను పంపిణీ చేశారు.తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, నియోజకవర్గ పరిశీలకులు మెంటే పార్థసారథి, తదితరులు ప్రసంగించారు.
కార్యక్రమంలో కొత్త నాగేంద్రబాబు, కొడాలి వినోద్, విజయలక్ష్మి, కే రమేష్, త్రినాధరావు, నాలుగు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.