🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరులో ముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో కర్బలా మైదాన్ వద్ద జేఏసీ నాయకులు ప్రారంభించారు. ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ హఫీజ్ ఇలియాజ్ మాట్లాడుతూ…. దేశంలో బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని, ఈ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పై పునరాలోచించి తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో దేశవ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమాలను ఉదృతంగా చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని .. హఫీజ్ ఇలియాజ్ ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ కన్వీనర్ హెచ్చరించారు.