The Desk…RJY : అనధికార లే ఔట్లపై చర్యలు తీసుకుంటాం : రుడా వైస్ చైర్మన్ కేతన్ గార్గ్

The Desk…RJY : అనధికార లే ఔట్లపై చర్యలు తీసుకుంటాం : రుడా వైస్ చైర్మన్ కేతన్ గార్గ్

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ (రుడా) : ది డెస్క్:

రుడా పరిధిలోని అనధికార లే ఔట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రుడా వైస్ చైర్మన్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ది.11-04-2025 తేదిన రుడా చైర్ పర్సన్ బొడ్డు వెంకట రమణ చౌదరి సూచనల మేరకు, వైస్‌ఛైర్‌పర్సన్ కేతన్ గార్గ్ రుడా పరిధిలోని గ్రామ పంచాయితీ కార్యదర్శులతో ‘అనధికార లే అవుట్’ లపై తీసుకొనబడుతున్నఎన్ ఫోర్స్ మెంట్ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశములు జారీ చేశారు.

ప్రత్యేకించి అనధికార లేఅవుట్ ల వల్ల ప్రజలకు, సమాజానికి జరుగుచున్న నష్టాలను, డెవెలప్ మెంట్ ఛార్జీల రూపంలో పంచాయతీలు కోల్పోతున్న ఆదాయము, తద్వారా పంచాయతీ పరిధిలో చేపట్టు మౌలిక వసతులు కలిగే అడ్డంకులు మొదలుగు వానిపై అవగాహన కల్పించటం జరిగినది.

రాబోయే మొదటి వారం రోజుల్లో ఆయా పంచాయితి పరిధిలోని ప్రతీ అనధికార లే అవుట్ ను గుర్తించి, వాటికి ఎ. పి. ఎమ్. ఆర్. యూ. డి. ఏ ఆక్ట్ సెక్షన్ 89 ప్రకారం జారీ చేయవలసిన ప్రొవిజినల్ ఆర్డర్ నోటిస్, కన్ఫర్మేషన్ ఆర్డర్ నోటీస్ మరియు ఎన్ఫోర్స్ మెంట్ చర్యలయిన సరిహద్దు రాళ్ళు తీసివేయుట, రోడ్డు లను తొలగించుట, హెచ్చరిక బోర్డు లు పెట్టుట, పంచాయతీ ఆఫీస్ నోటీస్ బోర్డు మరియు ముఖ్య ప్రదేశములలో సదరు అనధికార లే అవుట్ వివరములు ప్రదర్శించుట మొదలగు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించినారు.

ఈ కార్యక్రమం అమలు తీరుపై ప్రత్యేక బృందాలతో తనిఖీ నిర్వహించి, నివేదికల ప్రకారం నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్య దర్శి లపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్స్ చేయటం జరుగుతుంది అని తెలిపారు. లే అవుట్ డెవెలపర్ లకు, ప్రజలకు ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని కోరారు.

ఇకపై ప్రతీ వారం అనధికార లేఅవుట్ లపై నిర్వహించే సమీక్ష లో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డివిజినల్ పంచాయత్ ఆఫీసర్, ఈ.ఓ.పి.ఆర్.డి, ఎమ్.పి.డి.ఓ లు మరియు ప్రతీ పంచయతీ కార్యదర్శి తప్పనిసరిగా పాల్గొని, నివేదికలు సమర్పించాలని తెలిపారు.

ఈ వీడియొ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తొర్రేడు,నరేంద్ర పురం, హుకుం పేట, బొమ్మూరు, దేవరపల్లి, మొదలగు పంచయతీ కార్యదర్శులు తీసుకొన్న చర్యలపై వివరణ తీసుకొన్నారు.

రుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ జి. వి. ఎస్. ఎన్. మూర్తి మాట్లాడుతూ రుడా పరిధిలోని ఆయా గ్రామాలలో ఇప్పటికే గుర్తించ బడిన ‘1354 ఎకరాలలోని’ అనధికార లేఅవుట్ వివరములు తెలుపుతూ, వాటిపై రుడా కార్యాలయములో పరిశీలన జరుతుందని, తదుపరి కార్యాచరణ ప్రణాళికను వివరించి, అనధికార లేఅవుట్ ను ఇన్-ప్రిన్సిపల్ లేఅవుట్ పేట్రన్ చేయుటకు అవసరమగు సర్వే నెంబర్ల యొక్క ఎఫ్. ఎమ్. బి లు, అడంగల్ కాపీలు, రఫ్ స్కెచ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ వగైరాలు సమర్పించి రుడా కార్యాలయము ద్వారా క్రమ బద్దీకరించుటకు వీలు అవుతుందని ఆయా గ్రామాల కార్యా దర్శులు ఈ అవకాశమును వినియోగించుకోవాలి అని తెలిపారు.

అనధికార లే అవుట్ ల లోని రోడ్డు లను స్వాదీన పరుచుకోరాదని తెలిపారు. మరియు అనధికార లే అవుట్ ల లో భవన నిర్మాణ అనుమతులు ఈయరాదని తెలిపారు.

రుడా ప్లానింగ్ ఆఫీసర్ నార్కెడిమిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ కార్యాదర్శులు నిర్వహించ వలసిన బిల్డింగ్ ప్లాన్ రిజిస్టర్, అనధికార కట్టడముల రిజిస్టర్, అనధికార లే అవుట్ రిజిస్టర్ మొదలగునవి తెలుపుతూ,. పంచాయితీ లలో నిర్మాణ అనుమతులు ‘ప్రిస్’ యాప్ ద్వారా మాత్రమే ఇవ్వవలసినదిగా కోరారు. ఈ కార్యక్రంలో రుడా ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.