The Desk…Pedavegi : పెదవేగి గ్రామ పంచాయితీలో LTC ట్రైనింగ్

The Desk…Pedavegi : పెదవేగి గ్రామ పంచాయితీలో LTC ట్రైనింగ్

🔴 ఏలూరు జిల్లా : పెదవేగి మండలం : పెదవేగి : ది డెస్క్ :

నిన్న, నేడు పెదవేగి గ్రామపంచాయితీ నందు గల SWPC షెడ్డు నందు LTC ట్రైనింగ్ నిర్వహించుట జరిగింది. ఈరోజు జరిగిన శిక్షణ కార్యక్రమమునకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి CH. పద్మావతి దేవి అధ్యక్షత వహించగా…సదరు శిక్షణ కార్యక్రమము నందు MPDO పద్మావతిదేవి, మండల విస్తరణ అధికారి (పి ఆర్&ఆర్ డి) A.సుందరి, జిల్లా కోఆర్డినేటర్ G.ప్రసంగిరాజు పరిసరాలు పరిశుభ్రత , ప్రతి ఇంటి నుండి తడిచెత్త – పొడిచెత్తను వేరుచేసి తీసుకొనుట, వేరుచేసి వచ్చిన తడిచెత్త నుండి వర్మీ ఎరువు తయారు చేయుట, ప్రతి గురువారం తయారు అయిన వర్మీ ఎరువు పొడిచెత్త నుండి వచ్చిన ఇతర సామగ్రిని విక్రయించారు.

వాటి విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును గ్రామ పంచాయితీ నిధికి జమచేసి పంచాయితీలకు అభివృద్ధి వనరులు చేకూర్చుట, సదరు సొమ్మును గ్రామ అభివృద్ధికి వినియోగించుట, చెత్తను క్లాప్ మిత్రాలు మరియు గ్రీన్ అంబాసిడర్ ర్ల తో SWPC షెడ్డుకు చేర్చి గ్రామాలను పరిశుభ్రముగా ఉంచుట మరియు గ్రామలకు చెత్తనుండి ఆర్ధిక వనరులు చేకూర్చుట మరియు మొక్కలు నాటి వాటిని సంరక్షించుట, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిర్మూలించుట ఇవన్ని గ్రామ పంచాయితీల యందు నిర్వహిస్తేనే పంచాయితీల పరిసరాలు పరిశుభ్రముగా ఉంటాయి.

పరిసరాలు పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా వుంటారు కాబట్టి ఈవిషయములో ప్రధాన భూమిక పోషించేది క్లాప్ మిత్రాలు మరియు గ్రీన్ అంబాసిడర్ మాత్రమేనని.. వారిని ప్రశంసించడం జరిగింది. ఈ విషయములో గ్రామ పంచాయితీ మరియు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది ఒక కార్యచరణ ప్రకారం సదరు పనులను నిర్వర్తింపజేయవలసినదిగా తెలియజేయుట జరిగింది. మరియు సదరు శిక్షణాతరగతిలో పంచాయితీ కార్యదర్శులు T.ముత్తయ్య, M.వెంకట్రావు, KLV తనూజ DPRC భూషణం TOT లుగా నిర్వహించారు. ఈరోజు షెడ్యూలు ప్రకారం పెదవేగి గ్రామ పంచాయితీల కారుదర్శులు క్లాప్ మిత్రాలు మరియు గ్రీన్ అంబాసిడర్లు హాజరయ్యారు.