The Desk…Vijayawada : ప్రకాశం బ్యారేజ్ వద్ద మహిళ ప్రాణాలు కాపాడిన SDRF 16వ బెటాలియన్ సిబ్బంది

The Desk…Vijayawada : ప్రకాశం బ్యారేజ్ వద్ద మహిళ ప్రాణాలు కాపాడిన SDRF 16వ బెటాలియన్ సిబ్బంది

🔴 NTR DIST : THE DESK:

ఈ రోజు ఉదయం 9:40am సమయంలో విజయవాడలోని ఎనమలకుదురుకు చెందిన మేఖా దివ్య (29) ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ 67 నుండి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా… ఘటనను 16వ బెటాలియన్ SDRF దుర్గాఘాట్ వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బంది గమనించి.. వెంటనే బోటుతో ఘటనా స్థలానికి చేరుకొని, అదే సమయంలో U. రామకృష్ణ , RSI మరియు ఇద్దరు SDRF వ్యక్తులు బ్యారేజ్ వద్దకు పరుగన వెళ్లి మహిళకు తాడుతో కట్టిన లైఫ్ జాకెట్ విసరాగా.. బోట్ వేగంగా సంఘటనా స్థలానికి చేరుకొని, SDRF బృందం మహిళను రక్షించి ఆమె ప్రాణాలను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. వెంటనే విషయాన్ని 1టౌన్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయగా.. ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడకు చేరుకొని ఆమె వివరాలను సేకరించారు.

ఈ రోజు SDRF 16వ బెటాలియన్ దుర్గాఘాట్ సిబ్బంది గొప్ప సేవా ధృక్పథాన్ని చూపుతూ.. ఓ మహిళ ప్రాణాలను రక్షించారు. ఇది వారి సేవా నిబద్ధతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిందని మరియు AP SDRF సిబ్బంధి యొక్క పనితీరును బి.రాజకుమారి (IPS) వీరిని అభినందించారు.