The Desk…Eluru : జాతీయ రహదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు : MP పుట్టా మహేష్

The Desk…Eluru : జాతీయ రహదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు : MP పుట్టా మహేష్

ఏలూరు / డిల్లి : ది డెస్క్ :

ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 216-ఏ, 16 జాతీయ రహదారుల్లో నెలకున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఏలూరు జిల్లా భీమడోలు, కురెళ్లగూడెం, పూళ్ళ, కైకరం, చేబ్రోలు, నారాయణపురం గ్రామాల సమీపంలో గుర్తించిన ఏడు బ్లైండ్ స్పాట్‌ల వద్ద ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్‌లు లేదా సబ్‌వేలు నిర్మించాలని, సీతంపేట వద్ద ఫ్లై ఓవర్, బాక్స్ కల్వర్టు, ఉంగుటూరు గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి విధులు మంజూరు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మార్చి 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలతో కూడిన వినతి పత్రాలను కేంద్రమంత్రికి అందజేశారు.

ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బదులిచ్చారు. వినతి పత్రంలో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.