The Desk…Tadepalligudem : బాబు జగజ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బొలిశెట్టి

The Desk…Tadepalligudem : బాబు జగజ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బొలిశెట్టి

🥛 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త బాబుజగజ్జివన్ రామ్ 117వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండలం కృష్ణయ్య పాలెం, పడాల,పెంటపాడు ఎస్సీ పేట, ఉమామహేశ్వరం, యాగర్లపల్లి పలుగ్రామాలలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కృష్ణయ్యపాలెం గ్రామంలో నూతనముగా ఏర్పాటుచేసిన బాబు జగజ్జివన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరియు పెదతాడేపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా AP ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ…

భారత ఉప ప్రధానిగాను, కార్మిక శాఖ మంత్రిగాను, వ్యవసాయ శాఖ మంత్రి గాను పలు ఉన్నత పదవులు చేసిన మహనీయుడు.. వెనుకబడిన తరగతుల వారికి, ఆర్థిక అసమానతలు, కులవివక్ష చూపించే సమాజంలో.. రూపు మాపే విధంగా ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని.. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని… ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రతి ఏడాది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అలాగే మన పిల్లలకు మంచి విద్య అందించి, మన వలే కాకుండా వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా తీర్చిదిద్దాలని, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి కూటమి ప్రభుత్వం వృద్ధాప్య పింఛను, ఉచిత విద్య, ఉచిత వైద్యం , కులగనన చేసి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని , ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.