The Desk…Mehdipatnam : వీడు ఏడడుగుల బుల్లెట్టు..!!!

The Desk…Mehdipatnam : వీడు ఏడడుగుల బుల్లెట్టు..!!!

  • ఆరడుగుల బస్సులో ఏడడుగుల కండక్టర్‌

🔴 TG : మెహిదీపట్నం : THE DESK :

ఫోటోలోని వ్యక్తి పేరు అమీన్‌ అహ్మద్‌ అన్సారీ. చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్‌ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు.

అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది.బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది.

195 సెం.మీ.(6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోతున్నారు.

www.thedesknews.net