కృష్ణాజిల్లా: మచిలీపట్నం : ది డెస్క్ :
మచిలీపట్నం మండల, తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో గిరిపురం బీచ్ వద్ద ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షిస్తున్న గుడ్ల సంతాన ఉత్పత్తి కేంద్రం నుండి బుధవారం గుడ్ల నుండి బయటకు వచ్చిన తాబేలు పిల్లలను శుక్రవారం ఉదయం 300 ఆలివ్ రిడ్లె తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు,
కార్యక్రమములో అటవీ శాఖ రేంజర్ శ్రీ సాయి, సంరక్షణకేంద్రం ఇంచార్జి కె. నాగరాజు, గిలకలదిండి మెరైన్ ఎస్ఐ లు వి.జె.చంద్ర బోస్, పరింకాయల మురళీకృష్ణ, స్టేషన్ రైటర్ మద్దియ్య మరియు సంరక్షణ కేంద్ర సిబ్బంది సముద్రయ్య తదితరులు పాల్గొన్నారు.