- సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్
🔴 తూ.గోజిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన సాంస్కృతిక రాజధాని ప్రాంతంలో 500 కి పైగా ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లాలాచెరువు రోడ్డులో ప్రదర్శనల కు ఏర్పాట్లు రాజమహేంద్రవరం నగరంలోని లాలా చెరువు రహదారి ప్రధాన మార్గంలో “అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన” కు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు.
స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎమ్. మల్లిఖార్జున రావులతో “అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన” గొడప్రతిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ..
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో, దేశ వ్యాప్తంగా ఉన్న కళలకి ప్రాధాన్యతా కలుగచేస్తూ, రాష్ట్ర కళాకారులు ప్రతిభకు తగిన గుర్తింపు తీసుకుని, తిరిగి పూర్వ వైభవం తీసుకుని రావడంలో ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఏప్రియల్ 4 వ తేదీ శుక్రవారం లాలా చెరువు రహదారి మార్గంలో “అమరావతి చిత్ర కళా వీధి ప్రదర్శన” ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికీ 500 కి పైగా కళాకారులు వారి చిత్ర కళా ప్రదర్శనల్ని ప్రదర్శించే క్రమంలో పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్ర సాంస్కృతిక రాజధాని కేంద్రమైన రాజమండ్రీ లోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ని ఈ కార్యక్రమం ద్వారా వొచ్చే నిధుల్ని వెచ్చించి అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రదర్శనలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించే వారు www.amaravatiartfestival.com ద్వారా వారి పేర్లు నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్ కోరారు.