- ఏప్రిల్ మాసంలో 2,60,195 మంది ఫించన్ దారులకు పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు..
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్ టిఆర్ భరోసా పించను పధకము ఏప్రిల్ ’2025 నెల పింఛను చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశం ల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అగునని ఏప్రిల్ 1వ తేదీ ఫించన్లు ఏదైనా కారణం చేత తీసుకోని వారికి 02.04.2025 తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
ఏలూరు జిల్లాలో ఏప్రిల్ నెలలో 2,60,195 మంది ఫించన్ దారులకు 113.14కోట్ల రూపాయిలు పంపిణీ చేయవలసి ఉండగా ఏప్రిల్ 1వ తేదీన 100 శాతం ఫించన్లు పంపిణీ చేయాలని.. దానికి అనుగునంగా అధికారులు అందరూ పనిచేయాలని తెలియచేసారు.
జిల్లాలో ఏప్రిల్ 1వ తేదిన ఉదయం 7 గంటల నుండి ఫించన్ల ను ఇస్తున్న విషయాన్ని ప్రతి ఫించన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని, అలాగే ఫించన్ పంపిణీ సిబ్బంది 5292 మంది తప్పకుండా ఉదయం 7 గంటల కు పంపిణీ ప్రారంభించాలని.. ఫించన్ పంపిణీ లో ఎక్కడైనా ఏ ఒక్క పొరపాటు జరగకుండా ఫించన్లు పంపిణీ జరగాలని కోరారు.
అలాగే ఫించన్ దారులకు ఫించన్ తప్పకుండా ఇంటి వద్దనే ఇవ్వవలెను ఎట్టి పరిస్తితులలో ౩౦౦ మీటర్స్ లోపు పంపిణీ చేయాలని ఏకారణం చేతనైన చెయ్యవలిసి వస్తే కారణం యాప్ నందు నమోదు చేయాలని తెలియచేసారు.
ఫించన్ పంపిణీ సమయం లో ఎటువంటి అవినీతి జరిగినా క్రమశిక్షణా చర్యలు తీసుకొనడం జరుగుతుంది అని , ఫించన్ దారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి ఫించన్ పంపిణీ దారులకు ముందుగా నమస్కారం చేసి గౌరవం ఇవ్వాలని.. జిల్లాలోని అందరు మండల పరిషత్ అభివృద్ది అధికారులకు, మునిసిపల్ కమిషనర్ లకు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే ఏప్రిల్ నెల ఫించన్ పంపిణీ సమయం లో ప్రభుత్వ సందేశం తప్పని సరిగా వినిపించేటట్లు చర్యలు తీసుకొనవలేనని కలెక్టర్ వారు ఆదేశించారు.
ఈ కార్యక్రమము నందు డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.విజయరాజు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ, కె. భీమేస్వరావు, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి. నీలాద్రి, పాల్గొన్నారు.