The Desk…Eluru : ఎంపీ కార్యాలయంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

The Desk…Eluru : ఎంపీ కార్యాలయంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఏలూరు జిల్లా పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటనలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన నాయకులు మాట్లాడుతూ.. తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని నిలిపి, సామాన్యుడి చేతికి పాలన అధికారం ఇవ్వడానికి, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు మహనీయులు ఎన్టీఆర్ ప్రకటించారని తెలిపారు.

తెలుగుజాతికి గర్వకారణమైన, తెలుగువారి జీవనంలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముమ్మడి చింతయ్య, పుప్పాల హరీష్, పూజారి నిరంజన్, కిలారపు జగదీష్, కాట్రు బాలకృష్ణ (బాలు), ఆలూరి రమేష్, శాఖమూడి మహేష్, జడ్పీ విశ్రాంత సీఈవో కుమారస్వామి, కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.