- సుపరిపాలన అనేది టిడిపి వల్లనే సాధ్యం
- కార్యకర్తల త్యాగాలే పార్టీకి పునాదులు
- పాలకులు ఫలాపేక్ష రహితంగా పని చేయాలి
- కృషి, పట్టుదల ఉంటేనే ఉన్నత స్థాయికి చేరగలుగుతాం
➖పల్లా శ్రీనివాసరావు (రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు)
🔴 అమరావతి : ది డెస్క్ :
కృషి పట్టుదల సేవాభావం కలిగి ఉంటేనే సామాన్య కార్యకర్త సైతం ఉన్నత స్థాయికి చేరగలుగుతారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశ్వ వసునామ సంవత్సరం (ఉగాది) సందర్భంగా ఆయన స్థానిక దినపత్రికతో ఆయన మనోభావాలను పంచుకున్నారు. ఆయన మనోగతాన్ని ఆయన మాటల్లోనే చూద్దాం.. పల్లా శ్రీనివాసరావు మే12 , 1969 లో విశాఖ జిల్లాలో గల గాజువాక లో జన్మించారు.
ఆయన విద్యాభ్యాసం విశాఖపట్నంలోనే జరిగింది.పల్లా 1995లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ విశాఖపట్నంలో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. శ్రీనివాసరావు ప్రప్రధమంగా 2009లో రాజకీయాల పై మక్కువతో ప్రజారాజ్యం పార్టీ నుండి పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం ఆయన 2014లో అదే గాజువాక నియోజకవర్గం నుండి టిడిపి తరఫున శాసనసభ్యులుగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
అనంతరం 2024 లో మరల ఒకసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పటి ఆయన మెజారిటీ 95, 235 ఓట్లు భారీ మెజారిటీ రావడంతో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి అనేక పోరాటాలు చేసి పార్టీకి అండగా ఉన్నారు. 2019లో టిడిపి పార్లమెంటు అధ్యక్షునిగా కూడా పనిచేశారు.
స్వతహాగా వారి కుటుంబ నేపథ్యం రాజకీయాలతోనే ముడిపడింది శ్రీనివాసరావు తండ్రిగారైన సింహాచలం కూడా తెలుగుదేశం పార్టీ తరపున 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం-2 నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పల్లా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖపట్నంలో అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
అంతేకాకుండా విశాఖపట్నం ఊపిరిగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి అనేక ఉద్యమాలు చేపట్టి గాజువాక ప్రజల మనసులు దోచుకున్నారనడంలో సందేహం లేదు. పల్లా పార్టీకి చేసినటువంటి అంకితభావ సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి ఆయనకు జూన్ 14 2024 ఆయన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఆయన ఎప్పుడూ కూడా కార్యకర్తల త్యాగాలే పార్టీకి పునాదులని నమ్మేటువంటి వ్యక్తి.
ఈ సందర్భంగా ఆయన రెండు మాటలు మాట్లాడుతూ.. చంద్రబాబు కోమాలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఊపిరి పోసారని, పాలకులు అవినీతి రహితంగా పని చేయాలని, తెలుగుదేశం పార్టీ అనేది సుపరిపాలనకు నిలువుటద్దమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు నేతలకు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు స్నేహితులకు విశ్వ వసునామ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పల్లా శ్రీనివాసరావు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి గాజువాక నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలందించాలని మనసారా కోరుకుందాం.
బోల్లికొండ భవానీ శంకర్…. ఫ్రీలాన్స్ జర్నలిస్టు, ఏలూరు.