🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
ది 29-03-2025 తేది ఉదయం 10:30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా రవాణా అధికారివారి కార్యాలయము రాజమహేంద్రవరం నందు జప్తు చేయబడిన వాహనములకు బహిరంగవేలం నిర్వహించబడుతుందని జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా రవాణాశాఖధికారి (RTO) వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం వున్న కండీషన్ లో వేలం వేయబడును కావున ఆసక్తిగల అభ్యర్ధులు బహిరంగవేలంలో పాల్గొనువారు ముందుగా వాహనములు తనిఖీ చేసుకొని తదుపరి ఈ కార్యాలయము నందు వేయు వేలం పాటలో పాల్గొనువారు రూ.2,000/- లు ముందుగా డిపాజిట్ చేయవలెను.
వేలం అయిన తరువాత కట్టిన డిపాజిట్ తిరిగి చెల్లించబడును. వేలం పాటలో పాల్గొను వ్యక్తి రూ.200/- లు సర్వీస్ చార్జీ నిమిత్తము చెల్లించవలెను. సర్వీస్ చార్జి తిరిగి ఇవ్వబడదు. వేలం పాటలో వాహనము పొందిన వ్యక్తి సంబందిత జి.ఎస్.టి. చెల్లించవలెను.”పాట దారుడు వేలం సొమ్మును 50% వెంటనే చెల్లించ వలెను.
” మిగిలిన 50% 48 గంటల వ్యవదిలో చెల్లించవలసి యున్నది లేనిచో వేలం రద్దు చేయబడును.వేలం పాటలో వాహనం పొందిన పాటదారుడు డిపాజిట్ మినహా మిగిలిన సొమ్మును, పాట మొత్తముపై జి.ఎస్.టి. చెల్లించి వాహనము విడుదల పొందవలెను.
‘వేలంపాట తేదీని మార్చుటకు వేలంపాటను రద్దు పరచుటకు, జిల్లా రవాణా అధికారి, రాజమహేంద్రవరం వారికి పూర్తి హక్కు కలదు”